Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Ap Liquor Policy : ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే రాష్ట్రంలో పాత మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్సైజ్ విధానంలో ధరలు కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకుని పాలసీని రూపొందిస్తోంది. మద్యం దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా బ్రాండెడ్ మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులతో చర్చలు జరుపుతోంది. కొత్త మద్యం పాలసీ విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేసేలా ఏపీ సర్కార్ కార్యాచరణను రూపొందించనుంది. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఎలా ఉన్నాయి, ఆ పాలసీ అమలులో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాటి ద్వారా ఉండే ప్రయోజనాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు వేలం పాట ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అలాగే మద్యం విక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా చేయాలని ప్రభుత్వం దృష్టి సారించింది.
Admin
Studio18 News