Thursday, 12 March 2026 03:35:45 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

YS Sharmila : మీకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి జగన్..? షర్మిల సంచలన ట్వీట్

Date : 27 July 2024 11:14 AM Views : 451

Studio18 News - ANDHRA PRADESH / : YS Jagan Mohan Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపకపోవడంపై శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలకు ట్విటర్ వేదికగా షర్మిట కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ ప్రశ్నించడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అంటూ ప్రశ్నించారు. పార్టీ ఉనికికోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5ఏళ్లు బీజేపీతో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకా? అంటూ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు.. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయిఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చింది మీరు కాదా అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం అంటూ షర్మిల ప్రశ్నించారు. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని షర్మిల చెప్పారు. సిద్ధం అన్నవాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? అని షర్మిల ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :