Studio18 News - ANDHRA PRADESH / : Minister Kollu Ravindra : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ ఫైర్ అయ్యారు. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని కొల్లు రవీంద్ర సూచించారు. రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కుతిన్న జగన్ అండ్ కోకు.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుక్కొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి కొల్లు వీంద్ర అన్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొండాలి నానిలు పారిపోయారు. వారిని పేర్నినాని దాచాడనే అనుమానాలు ఉన్నాయని కొల్లు రవీంద్ర అన్నారు. హైదరాబాద్ లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళితే ప్రజలు తరిమికొట్టారు. జగన్ పిచ్చికి తగ్గట్లు మా బందరు వైసీపీ నేత పేర్ని నాని తయారయ్యాడు. సుపరిపాలనకోసం సీఎం వాట్సాప్ గ్రూప్ లు పెట్టమనడాన్ని ఆయన వక్రీకరిస్తున్నాడు. పేర్నినాని కూటమి ప్రభుత్వంపై ఇచ్చిమొచ్చినట్లు మాట్లాడితే ఏపీ ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంధ్ర హెచ్చరించారు.
Admin
Studio18 News