Saturday, 07 March 2026 09:03:12 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Chevireddy Bhaskar Reddy: చంద్రబాబు నంది అవార్డులు ఇస్తే ఇతడికి కూడా కూడా ఒకటివ్వాలి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Date : 20 July 2024 05:12 PM Views : 360

Studio18 News - ANDHRA PRADESH / : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందని ఓవైపు వార్తలు వస్తుండగా... మరోవైపు మోహిత్ రెడ్డి తండ్రి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పులివర్తి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడి జరిగిందంటూ ఆనాడు పులివర్తి నాని డ్రామా ఆడాడని విమర్శించారు. పులివర్తి నాని ఆ రోజు సాయంత్రం 4.12 గంటలకు ధర్నా చేద్దామని ఎంతో ఉత్సాహంగా షర్ట్ వేసుకుని బయల్దేరాడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. కానీ, 5.20 గంటలకు పరిస్థితి మారిపోయిందని... పులివర్తి నాని ఒంటిపై షర్ట్ మారిపోయిందని, టీషర్టు వచ్చిందని, కాలుకు కట్టు కూడా వచ్చిందని, చేతికి బ్యాండేజితో పాటు వీల్ చెయిర్ కూడా వచ్చిందని వివరించారు. "ఇతడు నాయకుడు ఎలా అవుతాడు... మంచి యాక్టర్ అవుతాడు గానీ! చంద్రబాబు నంది అవార్డులు ఇస్తే ఈయనకు కూడా ఒకటివ్వాలి. పబ్లిసిటీ కోసం అతను చేసిన యాక్టింగ్ వల్ల ఎస్సైలు సస్పెండ్ అయ్యారు, సీఐలు సస్పెండ్ అయ్యారు, డీఎస్పీలు సస్పెండ్ అయ్యారు, ఎస్పీ కూడా బదిలీ అయ్యాడు... ఏం చేస్తోంది పోలీస్ సంఘం?" అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు. "గతంలో పులివర్తి నాని క్వారీల్లో అధికారులు తనిఖీలకు వస్తే నన్ను సాయం అడగలేదా, నేను ఫోన్లో అధికారులతో మాట్లాడలేదా? రాజకీయం వేరు, వ్యాపారం వేరు. ఒకరి పొట్టకొట్టే పనులు చేయవద్దని ఆ రోజు సదరు అధికారితో నేను మాట్లాడింది నిజం కాదా? నీ క్వారీ వద్దకు ఒక్క అధికారిని కూడా పోనివ్వకుండా ఆపింది నేను కాదా? నీకు 12 లారీలు ఉన్నాయి... గత ప్రభుత్వ హయాంలో ఒక్క లారీ అయినా ఆగిందా? వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... ఏనాడూ పులివర్తి నానిని శత్రువులా భావించలేదు... ఓ రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూశాను... కానీ చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పులివర్తి నాని పదవులు పొందాలని చూస్తున్నారు" అంటూ చెవిరెడ్డి పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :