Studio18 News - ANDHRA PRADESH / : Narayana Swamy : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బదులకు గురిచేయడం తగదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని నారాయణ స్వామి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కొనసాగిస్తాను అని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. నేడు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ పెట్టారు. ఇప్పుడు పేదల కడుపు కొట్టారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం ద్వారానే విజయం సాధించగలిగారని నారాయణ స్వామి అన్నారు. మా ప్రభుత్వం ఎక్కడో తప్పు చేసిందని ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్ళింది. జగన్ ఇప్పుడయినా కార్యకర్తలతో మాట్లాడి బలపడుతున్నారు. ఈ రకంగా జగన్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు పెట్టిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మద్యం విషయంలో నేను తప్పు చేసినట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమే. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలుబొమ్మగా బ్రతకాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీతో నేను ఎక్సైజ్ మంత్రిగా పనిచేశానని నారాయణ స్వామి అన్నారు. నాకు ఎవరయినా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని నారాయణ స్వామి పేర్కొన్నారు. నా కుమార్తె ఓడిపోవడానికి గల కారణాలు నేను చెప్పదల్చుకోలేదు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో రికార్డులు తగలపెట్టారు.. అయినా అవన్నీ ఆన్ లైన్ లో వుంటాయి కదా అని నారాయణ స్వామి ప్రశ్నించారు.
Admin
Studio18 News