Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీకి బలం ఉన్నప్పటికీ టీడీపీ పోటీ చేస్తానని చెబుతోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని తెలిపారు. తమకు 530 పైచిలుకు ఓట్ల బలం ఉందని చెప్పారు. రెండు పార్టీల మధ్య 300 ఓట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, అందరినీ కలిశామని అన్నారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని, కూటమి పార్టీ అంత అమాయకంగా పోటీ చేస్తుందని తాను ఊహించడం లేదని తెలిపారు. తాము రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తున్నామని, రాజకీయాన్ని వ్యాపారంగా చూడడంలేదని అన్నారు. దుష్టులకు దూరంగా ఉండడానికే శిబిరం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కూటమి తరుఫున పారిశ్రామిక వేత్తను నిలుపుతున్నట్లు వార్తల్లో చుశానని, త్వరలోనే అన్ని విషయాలపై మాట్లడతానని తెలిపారు.
Admin
Studio18 News