Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ మంత్రి నారా లోకేశ్ నేడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెదకొండూరులో పర్యటించారు. ఇక్కడి కనక పుట్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మంత్రి లోకేశ్ కు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తామని తెలిపారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
Admin
Studio18 News