Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వరద పోటెత్తుతుండడంతో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరదలో కొట్టుకువచ్చిన బోట్లు తాకడంతో బ్యారేజ్ గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. బోట్లు అడ్డుపడిన చోట వరద నీరు నిలవడం, అది చూసేందుకు జనం వాహనాలు ఆపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాలను బ్యారేజీ పైకి అనుమతించడంలేదు. వరద భారీగా వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని వదలడంతో పాటు అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం ఉందని, కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను తెరిచి నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు వివరించారు.
Admin
Studio18 News