Saturday, 24 January 2026 07:55:10 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidu: జగన్ కి ఏ రంగు చూసినా ఎరుపు రంగుగానే కనిపిస్తోంది: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు

Date : 10 August 2024 12:54 PM Views : 292

Studio18 News - ANDHRA PRADESH / : మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. కక్షలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. హింస, హత్యల గురించి జగన్ రెడ్డి మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెప్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల కాలం ప్రజా పాలన కంటికి కనిపించలేదని విమర్శించారు. జగన్ రెడ్డి పాలన అనేకంటే 144 సెక్షన్ పాలన అని చెప్పుకుంటే బాగుంటుందని అన్నారు. ప్రజాతీర్పును ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారంతో ప్రజలను మరొకసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన దళితులకు చెందిన ఎకరం 40 సెంట్ల భూమిని వైసీపీ నాయకుడు నారపరెడ్డి లీజుకు తీసుకుని, లీజు సమయం పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వలేదని రామానాయుడు అన్నారు. పైగా వారిపై బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. భూమిని దళితులకు ఇవ్వాలని గ్రామ పెద్ద చెప్పిన పాపానికి నారపరెడ్డి, తన అనుచరులతో కలిసి ఆగస్టు 3న శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపై, వారి సోదరుల ఇంటిపై చేసిన దాడులు రికార్డులలో ఉన్నాయని అన్నారు. కుటుంబ కలహాల మధ్య జరిగిన తగదాల వల్ల సుబ్బారాయుడు మరణిస్తే దానికి కూడా రాజకీయ రంగు పులిమి టీడీపీకి అంటగట్టే విషప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ హత్యను సైతం టీడీపీ హత్యగానే ప్రచారం చేసి విఫలమైందని, అందువల్లే నంద్యాలలో ఈ డ్రామాకు తెరలేపారని మంత్రి అన్నారు. జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి విషప్రచారం చేస్తున్నారని, జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో నేర్పరి అని అన్నారు. జగన్ రెడ్డి పదేపదే రెడ్ బుక్‌ను కలవరిస్తున్నారని అన్నారు. జగన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏ రంగు చూసినా ఎరుపు రంగుగానే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి రామానాయుడు దీమా వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :