Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Nimmala Rama Naidu: ఆంధ్రప్రదేశ్‌లోని బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు, కొల్లేరులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడానికి సర్వే చేయిస్తామని తెలిపారు. బుడమేరు వల్ల బెజవాడ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే బుడమేరుకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. గడిచిన వైసీపీ ఐదేళ్ల పాలనలో బుడమేరుకు రూపాయి ఖర్చు పెట్టలేదు తట్ట మట్టి ఎత్తలేదని విమర్శించారు. కనీస నిర్వహణ ఉండుంటే ఈరోజు బెజవాడ వాసులకు బుడమేరు ముప్పు ఉండేది కాదని చెప్పారు. బుడమేరు కాలువకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూడుస్తున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు. నేటి సాయంత్రానికల్లా ప్రధానమైన ప్రాంతాల్లో పడిన గండ్లను పూర్తి చేస్తామని అన్నారు. రెండు, మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో పడిన గండ్లను పూడ్చటానికి సర్వేకంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, దగ్గర ఉండి మరీ అక్కడి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు.
Admin
Studio18 News