Studio18 News - ANDHRA PRADESH / : కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 1.91 కోట్ల రూపాయలు విలువ గల 158 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మినీ లారీ, ఒక ట్రాక్టర్, ఒక బైక్ ను ఎర్రగుంట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్ల అంతా పొట్లదుర్తి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలను పోరుమామిళ్ల, బద్వేల్ పరిధిలోని నల్లమల్ల అడవి ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి పోట్లదుర్తి గ్రామంలోని బాషా ఇంట్లో డంప్ చేసి, చెన్నైకి తరలించే సమయంలో ఎర్రచందనం దుంగలను పట్టుకోవడం జరిగిందని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పేర్కొన్నారు..
Also Read : annamayya : చిక్కిన అంతరాష్ట్ర దొంగ
ADVT
Admin
Studio18 News