Friday, 13 December 2024 09:20:02 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

telangana High Court: నాగచైతన్య, శోభిత విషయంలో వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Date : 29 August 2024 11:30 AM Views : 39

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సినీ సెలబ్రిటీలు, రాజకీయ పార్టీలపై జోస్యాలు చెబుతూ పాప్యులర్ అయిన అస్ట్రాలజర్ వేణుస్వామికి ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై వేణుస్వామికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల నాగచైతన్య, శోభిత నిశ్చితార్థ వేడుకలు జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే వేణుస్వామి వారి వైవాహిక జీవితంపై సంచలన జోస్యం చెప్పారు. 2027వరకే వారు కలిసి ఉంటారని తర్వాత విడిపోతారంటూ వేణుస్వామి ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి ఈ రకంగా జోస్యం చెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఆయన చెప్పిన జోస్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ మహిళా కమిషన్ కు వేణుస్వామిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ నుండి విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు? అంటూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ను ప్రశ్నించింది. మహిళా కమిషన్ నోటీసులు చెల్లవంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు