Sunday, 08 March 2026 10:58:48 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Nadendla Manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు

Date : 07 August 2024 11:47 AM Views : 296

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఇతర దేశాలకు రవాణా అవుతున్నట్లుగా గుర్తించారు. కాకినాడలో గోడౌన్ లలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎనిమిది విభాగాల పర్యవేక్షణలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ముంబయి రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొన్న ఒక్క రోజునే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ అడ్డాగా రేషన్ మాఫియా దందా సాగిస్తోందని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :