Studio18 News - ANDHRA PRADESH / : శాంతి అనే ప్రభుత్వ ఉద్యోగినితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా విజయసాయి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పారు. ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా ఉన్న శాంతిని 2020 సంవత్సరంలో వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కూతురుగానే భావించానని... ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానని అన్నారు. తనకు కొడుకు పుట్టాడని చెపితే వెళ్లి పరామర్శించానని తెలిపారు. తమ తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానని చెప్పారు. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు తనకు లేవని స్పష్టం చేశారు. తాను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెపుతానని అన్నారు.
Admin
Studio18 News