Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Kumaradevam Cinema Tree: తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతికి సుమారు 170 సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ చెట్టు నేలకొరిగింది. వందలాది సినిమాల్లో చెట్టు కింద అనేక పాటలు తీశారు డైరెక్టర్లు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరాన ఈ గన్నేరు చెట్టు ఉంది. అనేక సినిమాలు ఈ చెట్టు నీడలో తీయడం వల్ల ఈ చెట్టుకు సినిమా చెట్టు అని పేరు కూడా పెట్టారు. నిర్మాతలకు, దర్శకులకు వారి సినిమాలో ఈ చెట్టును చూపిస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందని దృఢ నమ్మకం కూడా ఏర్పడింది. అందువల్లే అనేకమంది దర్శకులు, నిర్మాతలు ఈ చెట్టు నీడలో అనేక సినిమాలు చిత్రీకరించారని ఇక్కడివారు చెబుతారు. ముత్యాల ముగ్గు, సీతారామయ్యగారి మనవరాలు సహా చాలా సినిమాల్లో ఈ చెట్టు కనబడుతుంది. అప్పట్లో గోదావరి రేవుకు సంబంధించిన సన్నివేశాల్లో చాలావరకు ఇక్కడే తీసేవారు. కాగా, ఎగువన కురిసిన భారీ వర్షాలతో రెండు రోజుల క్రితం గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. కాగా, ఎగువన కురిసిన భారీ వర్షాలతో రెండు రోజుల క్రితం గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరిలోకి భారీగా వరద నీరు ప్రవహించింవది. పలు గ్రామాల పంట భూములు కోతకు గురయ్యాయి. కొబ్బరి, అరటి పంటలు కూడా గోదావరి వరదలో కొట్టుకుపోయాయి.
Admin
Studio18 News