Sunday, 08 March 2026 10:29:40 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Goods Train : బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నాలుగు రోజుల్లో రెండోసారి

Date : 26 July 2024 10:35 AM Views : 347

Studio18 News - ANDHRA PRADESH / : Goods Train Derailed : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒక బోగి పట్టాలు తప్పిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున 4.40 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సమయంలో ఆ రూట్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోవడంతో రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో స్థానిక రైల్వే గేటు మూతపడింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో విజయవాడ – చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంత ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ఇదిలాఉంటే గత నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నెల్లూరు వైపు నుంచి బిట్రగుంట స్టేషన్ యార్డులోకి నెమ్మదిగా వస్తున్న సమయంలో క్రాసింగ్ వద్ద మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటీన సంఘటన స్థలికి చేరుకొని మరమ్మతలు చేపట్టారు. అయితే, నాలుగు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఒకే ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :