Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మంత్రి కారు దానిని ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను తప్పించే క్రమంలోనే ఎస్కార్ట్ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారని వివరించారు.
Admin
Studio18 News