Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. తుగ్గలి పరిధిలోని బొల్లవానిపల్లెలో ఓ రైతు పొలంలో పనులు చేస్తుండగా అతని కంటికి ఓ మెరుస్తున్న చిన్న రాయి కనిపించింది. దాంతో రైతు అనుమానంతో ఆ రాయిని తీసుకుని వెళ్లి జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించాడు. అది మాములు రాయి కాదని, వజ్రమని చెప్పడంతో రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ వజ్రాన్ని తీసుకుని రైతుకు వ్యాపారి రూ. 2.50లక్షలు ఇచ్చాడు. కాగా, బయట మార్కెట్‌లో ఆ వజ్రం ఖరీదు రూ. 5లక్షల వరకు ఉంటుందని వ్యాపారి తెలిపారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తుగ్గలి రైతు పొలంలో ఈ వజ్రం బయటపడింది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని పలువురు రైతులకు ఇలాగే వజ్రాలు దొరికాయి. వర్షకాలం మొదలుకాగానే తొలకరి సమయంలో భారీ ఎత్తున జనాలు తుగ్గలిలో వజ్రాల వేటకు వస్తుంటారు.
Admin
Studio18 News