Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Divvala Madhuri Car Accident : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దువ్వాడ ఇంటి వద్ద అతని భార్య దువ్వాడ వాణి, కుమార్తె నిరసన దీక్ష నాల్గోరోజూ కొనసాగుతుంది. మరోవైపు ఆదివారం దివ్వెల మాధురి ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. పలాస టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై ఆమె కారు ప్రమాదంకు గురైంది. స్వల్ప గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మాధురి మాట్లాడుతూ.. చనిపోదామనే హైవే పైకి వచ్చానని తెలిపింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన ఆడపిల్లలను సైతం ట్రోల్ చేస్తున్నారని, తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొంది. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని హైవేపైకి వెళ్లానని, లారీ ఢీకొట్టి చనిపోదామని అనుకుంటే.. కారు ఢీకొట్టానని మాధురి చెప్పింది. మాధురి వేగంగా కారును డ్రైవ్ చేసి వేరే కారును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కారు ఒరిస్సా హైకోర్టు అడ్వకేట్ సుధాకర్ ది. ఈ ఘటనపై సుధాకర్ స్పందించారు. తన కారును ఢీకొట్టిన మాధురిపై సుధాకర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆమె సూసైడ్ చేసుకోవటానికి నా కారే దొరికిందా అంటూ సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తన భార్య శైలజతో కలిసి పలాస బ్రాహ్మణతర్ల వచ్చాను. పలాస హైవేపై గూగుల్ మ్యాప్ లో అడ్రస్ చూడటానికి ఆగాను. ఆ సమయంలో మాధురి కారు వేగంగా వచ్చి నా కారును ఢీకొట్టిందని సుధాకర్ తెలిపారు. కారు ప్రమాదంలో నా భార్యకు చిన్న గాయాలయ్యాయి. మాధురి సూసైడ్ చేసుకోవటానికి నా కారును ఢీకొట్టడం దారుణం. ఇలాంటిది అనైతిక చర్య. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు సుధాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాధురి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
Admin
Studio18 News