Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YCP MP Midhun Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షపూరితంగా ఎన్డీయే నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో భారీ వర్షాలుపడి జనజీవనం అస్థవ్యస్థమైతే ప్రభుత్వం పట్టించుకోలేదు.. కానీ, సినీనటి కాదంబరి జత్వాని వ్యవహారాన్ని మాత్రం ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలులేని నటి వ్యవహారానికి ఎందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.. నటి వ్యవహారంలో పోలీసులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. మదనపల్లె ఫైళ్ల కేసుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. చంద్రబాబు, లోకేశ్ లు మాత్రం పట్టించుకోవడం లేదని మిథున్ రెడ్డి విమర్శించారు. ప్రశ్నించిన వారిని కూటమి నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పుంగనూరులో మున్సిపల్ ఛైర్మన్, మిగిలిన సభ్యులను భయపెట్టి టీడీపీలో చేరమని ఒత్తిడి తెస్తున్నారని మిథున్ రెడ్డి టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News