Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది. వరద విలయానికి ప్రజాజీవనం స్తంభించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చూస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Admin
Studio18 News