Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : CM Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. అంతేకాదు.. డప్పు వాయించారు. గిరిజన సంప్రదాయం కొమ్మకోయ దరించారు. ఆదివాసీ ప్రజలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు ఆదివాసీ మహిళలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు సంప్రదాయ నృత్యం చేశారు. డప్పు వాయించారు. ఆదివాసీ ప్రజలో సరదాగా ముచ్చటించారు. ఆ తరువాత అరకు కాపీ ఉత్పత్తులను పరిశీలించారు. చంద్రబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆదివాసీ జీవనశైలికి సంబంధించిన పనిముట్లను ఆసక్తిగా తిలకించారు. గిరిజనుల తేనెను చంద్రబాబు కొనుగోలు చేశారు.
Admin
Studio18 News