Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీకి చెందిన ఓ మహిళ మలేసియాలో అనూహ్య రీతిలో గల్లంతైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో ఆ మహిళ నడుస్తుండగా, ఫుట్ పాత్ ఒక్కసారిగా కుంగిపోయింది. దాంతో ఆ మహిళ 10 మీటర్ల లోతున్న డ్రైనేజీలో పడిపోయింది. ఆ మహిళ పేరు విజయలక్ష్మి (45). చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అనిమిగానిపల్లె ఆమె స్వగ్రామం. కౌలాలంపూర్ లో ఆమె తన భర్త, కుమారుడితో కలిసి పూసల వ్యాపారం చేస్తోంది. మలేసియాలో తెలుగు మహిళ గల్లంతు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కౌలాలంపూర్ లో వెంటనే గాలింపు చర్యలు చేపట్టేలా చూడాలని ఏపీ ఎన్నార్టీ అధికారులను ఆదేశించారు. ఆ మహిళ కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు... అనిమిగానిపల్లెలో మహిళ కుటుంబసభ్యులను పరామర్శించాలని సూచించారు. చంద్రబాబు సూచన మేరకు ఎమ్మెల్సీ శ్రీకాంత్... మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
Admin
Studio18 News