Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే విశాఖపట్టణం చేరుకున్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పల్లాను ఆ స్థానంలో నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది.
Admin
Studio18 News