Studio18 News - ANDHRA PRADESH / : TDP Leader Buddha Venkanna : వైసీపీ ప్రభుత్వం హయాంలో అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం అని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి, శాంతి వ్యవహారం చూశాం. గంట, అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సకలశాఖల మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్ పాలనకు, చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడండి. జగన్, వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీఇన్నీ కావు. ఆడుదాం ఆంధ్రా అని కోట్లు దోచుకున్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలను నాశనం చేశారంటూ బుద్దా వెంకన్న మండిపడ్డారు. నటి జిత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్ లు పరుగులు పెట్టారంట. ఛీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయం అంటూ బుద్దా వెంకన్న వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ ప్రశ్నించారు. సజ్జల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలని బుద్దా వెంకన్న అన్నారు. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాద్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి. ఈ కేసుల్లో పాత్రదారులు, సూత్రదారులను ప్రాసిక్యూట్ చేయాలి బుద్దా వెంకన్న డిమాండ్ ప్రభుత్వాన్ని కోరారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. చివరకు ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహరించారు. అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
Admin
Studio18 News