Monday, 02 December 2024 05:19:12 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు.. గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 29 August 2024 01:56 PM Views : 36

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ganta srinivasa rao: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీలో చేరుతుండడంపై టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”వైసీపీ మునిగిపోయే నావ. ఈ విషయం ముందే చెప్పాను. రాజీనామా చేసి మా పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తున్నాం. ఇప్పడు చేరుతున్న వారు రాజీనామా చేసి పార్టీ లో చేరుతున్నారు. విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల సమయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. అభివృద్ధి దృష్ట్యా కొందరి చేరికలు పార్టీకి బలం చేకూరుతాయని స్పష్టం చేశాను. పరిస్థితి చూస్తూ ఉంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు మిగిలేలా లేరు. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డిన”ని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కాగా, సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులు మోవిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీకి రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఇమడలేక ఎవరైనా టీడీపీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంత మంది నాయకుల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ బలోపేతానికి అవసరమైన వారినే చేర్చుకుంటామన్నారు. ఎవరినిబడితే వారిని పార్టీలోకి తీసుకోవద్దని పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అధిష్టానానికి సూచించారు. అధికారం కోసం వారిని చేర్చుకుంటే.. అధికారం లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని అవమానించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, అభివృద్ధి కోరుకుని, తమతో కలిసి పనిచేయడానికి వచ్చేవారికి ఆహ్వానం పలుకుతామని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు