Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం అని, మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ నేత అరాచకాలను పదేళ్లుగా చూస్తున్నామని అన్నారు. భారత స్వాతంత్ర్యాన్ని, మువ్వన్నెల జెండాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించాయని చెప్పారు. మూడు రంగుల జెండాను గౌరవించబోమని చెప్పిందని అన్నారు. ఒకే రంగు ఉండాలి అని చెప్పారని, హిందువులు గౌరవించరు అని అన్నారని తెలిపారు. 2001 వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఎగురవేయలేదని అన్నారు. భారత్‌కు నరేంద్ర మోదీ చేసింది ఏమీ లేదని, అంతేగాక, ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు. నిరుద్యోగులను, రైతులను మోసం చేశారని, మణిపూర్ లో ఊచ కోత కోశారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని, విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు. భారత్‌లో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని అన్నారు.
Admin
Studio18 News