Studio18 News - ANDHRA PRADESH / : Amaravati Construction Works : ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతికి కొత్త రూపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 36 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 24 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టింది. ఇటు గత నిర్మాణాలను ఇప్పటికే ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. నిర్మాణాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం దేశ విదేశీ సంస్థలు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు.
Admin
Studio18 News