Sunday, 25 January 2026 05:47:49 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Jogi Rajeev: జోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ

Date : 13 August 2024 04:02 PM Views : 305

Studio18 News - ANDHRA PRADESH / : అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది. అలాగే ఏ2గా జోగి వెంకటేశ్వరావు పేరు చేర్చింది. వీరితో పాటు ఎఫ్‌ఐఆర్‌లో అంబాపురం మండల సర్వేయర్‌ రమేశ్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావుల‌ను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదే వ్య‌వ‌హారంలో ఆగస్టు 8న అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు. మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారంటూ విజయవాడ పోలీసులు నివేదిక ఇచ్చారు. దీంతో విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సర్వే జరపకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఏసీబీ నిర్ధారించింది. సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా నివేదిక‌ ఇచ్చినట్లు తేల్చింది. 87 సర్వేనెంబర్ సీఐడీ అటాచ్‌లో ఉందని ఏసీబీ గుర్తించింది. నున్న సబ్ రిజిస్ట్రార్‌ రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ తెలిపింది. జప్తులో ఉన్న అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి, విక్రయించినట్టు జోగి రమేశ్ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :