Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Niharika – Pithapuram : పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురం పేరు దేశమంతా మారుమోగింది సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులే కాదు పవన్ గెలుపుతో సినిమా వాళ్ళ చూపు కూడా పిఠాపురం వైపు వెళ్ళింది. సినిమా వాళ్ళు అటు వైపు ఎవ్వరు వెళ్లినా పిఠాపురం వెళ్తున్నారు. పిఠాపురంలో సినిమా ఈవెంట్స్ కూడా జరుగుతాయని గతంలో వార్తలు వచ్చాయి, త్వరలో అది కూడా మొదలవుతుందని టాలీవుడ్ హంగామా చూస్తే తెలుస్తుంది. తాజాగా బాబాయ్ నియోజకవర్గానికి నిహారిక కొణిదెల వెళ్ళింది. నేడు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురానికి మెగా డాటర్ నిహారిక వెళ్ళింది. నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తెరకెక్కిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 9 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు పిఠాపురం వెళ్ళింది నిహారిక. ఈ సందర్భంగా నిహారిక పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించింది. నిహారిక పిఠాపురంలో పర్యటించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ గెలిచాక మొదటిసారి నిహారిక పిఠాపురం రావడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెని చూడటానికి, ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.
Admin
Studio18 News