Studio18 News - ANDHRA PRADESH / : అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఏపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. బ్రెయిన్ డెడ్ అయి అవయవదానం చేసే జీవన్మృతులకు ప్రభుత్వం తరపున అంత్యక్రియలు జరపనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కూటమి సర్కార్ గురువారం అవయవదాతలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా ‘జీవన్ దాన్’ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని తెలిపింది. తొలుత ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్‌కు ఆలస్యం లేకుండా సమాచారం తెలియజేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జీవన్మృతుడికి సంబంధించి భౌతికకాయానికి తగిన గౌరవం ఇస్తూ ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ తరపున ప్రభుత్వ ప్రతినిధి ఒకరు హాజరవుతారని ప్రభుత్వం పేర్కొంది.
Admin
Studio18 News