Studio18 News - ANDHRA PRADESH / : విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టు గేట్ వరదలకు కొట్టుకుపోయిన నేపథ్యంలో స్టాప్ లాక్ గేటు అమర్చే ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో కన్నయ్య నాయుడు చూపిన చొరవను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కన్నయ్య నాయుడు కలువగా అభినందనలు తెలియజేశారు. తాజాగా కన్నయ్య నాయుడుని ప్రభుత్వం జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయంలో అందోళనతో ఉన్న ప్రభుత్వం .. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణ విషయంలో ఆయన సలహాలను స్వీకరించనుంది.
Admin
Studio18 News