Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిపై దాడులు చేస్తున్నారని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేస్తున్న ధర్నాకు అఖలేశ్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ… దాడులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారని, రేపు జగన్ ముఖ్యమంత్రి కావచ్చని చెప్పారు. బుల్డోజర్ రాజకీయాలకు సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. భయపట్టే వారు అధికారం కోల్పోతారని అన్నారు. జగన్ పార్టీ కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. పార్టీని కార్యకర్తలే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కూడా బుల్డోజర్ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని చెప్పారు. బీజేపీ తన తీరు మార్చుకోవాలని అన్నారు. ప్రజలు హింసను సహించరని చెప్పారు. రేపు ఏపీలో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చని, కానీ కార్యకర్తలకు అన్యాయం జరగకూడదని అన్నారు. రాజకీయాల్లో అధికారంలో ఉంటాం.. పోతామని చెప్పారు. ఇతరుల ప్రాణాల్ని తీయాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ కక్షలు అవసరం లేదని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని అన్నారు.
Admin
Studio18 News