Studio18 News - ANDHRA PRADESH / : Prakasam Barrage Boats Removal : ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు పనులు మూడవ రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తియ్యడం సాధ్యం కాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా బోట్లను ముక్కలు చేసి తొలగిస్తున్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నులు బరువు ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీమ్ లను అధికారులు రంగంలోకి దించారు.
Admin
Studio18 News