Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Buddha Venkanna : జగన్ బ్యాచ్ రాష్ట్రం మొత్తం దోచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీశాఖలో ఉన్న ఫైళ్ళు తగులబెడుతున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ నెట్ లో మధుసూధన్ రెడ్డి తన అన్నకి 12కోట్లు ఎలా అప్పజెప్పాడంటూ ప్రశ్నించారు. నిక్కర్ బ్యాచ్, బనియన్ల బ్యాచ్ అని హైదరాబాదులో సవాలు చేసినట్టు ఉంది. ఒక్క పరిశ్రమ రాకుండా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా..? ఆడుదాం ఆంధ్రా అంటూ.. రోజా నీతులు చెప్పింది. జోగి రమేష్ తనయుడు అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా దోచాడు. మేం ఏం బూతులు తిట్టడం లేదు.. తిట్టిన వాళ్ళు ఏమైపోయారో తెలుసు. జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల నష్టపరిహారం జేబులో వేసుకున్నారు. గేదె చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది జగన్ బ్యాచ్ పరిస్ధితి అని బుద్ధా వెంకన్న విమర్శించారు. ఫలానా శాఖలో దోచుకోలేదని చెప్పగలిగే దమ్ము వైసీపీలో ఎవడికైనా ఉందా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఇలా దోచుకోవడం, ఫైళ్ళు దగ్ధం చేయడం జగన్ కే తెలిసిన ఆర్ట్. మంచి మాటలు చెవిన పడవు.. అధికారులు ఇవాళ సస్పెండ్ అవుతున్నారు. ఆ అధికారులు అందరూ జైలుకు వెళతారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏవ్యక్తి అయినా కటకటాలు లెక్కపెట్టక తప్పదని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
Admin
Studio18 News