Studio18 News - ANDHRA PRADESH / : నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బాలిక మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. తాజాగా.. ఈ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ముచ్చుమర్రికి చెందిన వ్యక్తి యెహోన్ (హుస్సేన్) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ముగ్గురు మైనర్ బాలురులో ఒకరికి మేనమామగా సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 30 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బాలికపై అత్యాచారం, హత్య కేసులో యెహోన్ ను పోలీసులు విచారించారు. మృతిడి ముఖం, ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాకప్ డెత్ జరిగిందని, కేసు విచారణ పేరుతో పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.
Admin
Studio18 News