Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో చేపట్టిన మాష్టర్ ప్లాన్ రోడ్లన్నీ నాసిరకంగా ఉన్నాయని తెలుగుదేశంపార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహా యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ నాసిరకంగా ఉన్నాయని, ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు పూర్తయిన నేపథ్యంలో వాటినన్నిటిని నిపుణులతో పరిశీలించి, రోడ్ల నాణ్యతను పూర్తి స్థాయిలో చూసిన అనంతరం కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించాలని, అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులను, టీటీడీ పనులకు సంబంధించి చేపట్టిన నిర్మాణాల నాణ్యతను సైతం నిపుణులైన కమిటీ పరిశీలించాలని డిమాండ్ చేస్తూ అప్పటి వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేయకూడదని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్పోరేటర్లు తదితరులు పాల్గోన్నారు.
Also Read : kadapa : ఎన్ సీసీ విద్యార్థుల ఆందోళన
Admin
Studio18 News