Studio18 News - ANDHRA PRADESH / : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. వన మహోత్సవంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్‌టీయూ ఆవరణలో 'వనం మనం' పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ హజరు కావాల్సి ఉండగా, నరసరావుపేటలో భారీ వర్షం కారణంగా సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వీరి పర్యటన రద్దు అయ్యింది. ఈ క్రమంలో మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం, డిప్యూటి సీఎం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. చెట్ల మద్య డిప్యూటి సీఎం పవన్, కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి సీఎం చంద్రబాబు నడిచారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్చమైన గాలిని పీల్చుకుంటున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చెట్లు, మొక్కల జాతులను అడిగి తెలుసుకున్నారు. ఏకో పార్క్ లో ఏర్పాటు చేసిన వివిధ పక్షి జాతుల ఫోటోలను వీక్షించారు.
Admin
Studio18 News