Studio18 News - ANDHRA PRADESH / : Janasena party office opened in Visakha district : విశాఖ జిల్లాలో జనసేన పార్టీ నుతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభోత్సవానికి మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్, టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభానికి టీడీపీ, బీజేపీ నేతలు కూడా రావడం సంతోషంగా ఉందని అన్నారు. విశాఖ వేదికగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ ఆఫీసులో నేను అందుబాటులో ఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం శ్రమిస్తున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే విధంగా మా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. విశాఖలోఉన్న సహజ వనరులను వినియోగించుకుంటూ టూరిజం పరంగా, ఐటీ పరంగా అభివృద్ధి చెయ్యాలని కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది రేపు ప్రకటించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున బరిలో నిలిచే అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని అన్నారు. ఎవరి వ్యక్తి గత విషయాలను మాట్లాడను. కానీ, కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వారిని విహార యాత్రలకు తిప్పుతున్నాడని అన్నారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని జనసేన ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. దువ్వాడ ఇష్యూపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కష్టాల్లో ఉన్నాడు.. ఆయనకు నా సానుభూతిని తెలుపుతున్నానని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
Admin
Studio18 News