Sunday, 25 January 2026 04:54:36 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pawan Kalyan: చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే: పవన్ కల్యాణ్

Date : 23 August 2024 02:37 PM Views : 384

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీకి చంద్రబాబు అనుభవం అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తప్పించేందుకు, సంపద సృష్టించేందుకు చంద్రబాబు అనుభవం అవసరమని చెప్పారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. పంచాయతీలకు ప్రభుత్వ పరంగా ఆస్తులు లేకపోతే వ్యర్థమని పవన్ చెప్పారు. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని అన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకోబోమని... అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు కూడా లేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఉంటే నిర్మాణాలు చేసుకోవచ్చని చెప్పారు. దాతలు ముందుకు రావాలని... తాను కూడా నిధులు తీసుకొచ్చి క్రీడా మైదానాలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదని... కానీ, గుండెల నిండా నిబద్ధత ఉందని పవన్ అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని చెప్పారు. ఎంతో పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేర్చుకోవాలనే తపన తనకుందని అన్నారు. ప్రజల కోసం కూలీగా పని చేసేందుకు సిద్ధమని చెప్పారు. వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని పవన్ విమర్శించారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్ లే ఉన్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ పని చేయాలని సూచించారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి వెన్నెముక అని చెప్పారు. పదవులు తనకు అలంకరణ కాదని... బాధ్యత అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :