Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వచ్చే నెల 9 తో గడువు ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈమేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ వివరాలు వెల్లడించారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయని, డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నియామకాలను శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in https://apmsrb.ap.gov.in/msrb/ సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.
Admin
Studio18 News