Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరు కాగా... జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరుకాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది.
Admin
Studio18 News