Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బస్సు కింద పడి పాప శరీరం నలిగిపోయింది. జేసీబీతో బస్సును పైకి లేపి పాప మృతదేహాన్ని బయటకు తీశారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు.. ఓబులవారి పాలెంలో శ్రీవాణి పబ్లిక్ స్కూల్ కు చెందిన బస్సు రోజూలాగే సోమవారం పిల్లలను స్కూలుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న కంకర రాయి పైకి ఎక్కడంతో బస్సు అదుపుతప్పింది. బస్సు బోల్తా పడింది. డోర్ పక్కనే కూర్చున్న ఓ బాలిక రోడ్డుపై పడిపోగా.. ఆ చిన్నారి మీద బస్సు పడింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చుట్టుపక్కల వారు స్పందించి జేసీబీతో బస్సును పక్కకు తొలగించారు. అప్పటికే చిన్నారి మృత్యువాత పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, స్కూలుకు బయలుదేరిన కూతురు బస్సు కింద పడి చనిపోయిందన్న వార్త తెలిసి పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Admin
Studio18 News