Studio18 News - ANDHRA PRADESH / : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. శనివారం ఉదయం ట్రాఫిక్ సమస్య కారణంగా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై వ్యాన్ బోల్తా పడటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుండి లక్ష్మారెడ్డిపాలెం వరకూ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారిపై గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రహదారిపై బోల్తా కొట్టిన ట్రక్ ను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు.
Admin
Studio18 News