Friday, 13 December 2024 08:32:14 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP Govt: నేడు ఆరుగురు ఏపీ ఐఏఎస్‌ల పదవీ విరమణ

Date : 31 August 2024 02:59 PM Views : 55

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో ఒకే రోజు ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ జాబితాలో వైసీపీ హయాంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన రజత్ భార్గవ కూడా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగాడన్న అభియోగాలు ఉన్న రజత్ భార్గవను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పదవి నుండి బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే పదవీ విరమణకు ఒక్క రోజు ముందు అంటే శుక్రవారం రజత్ భార్గవను ప్రభుత్వం... సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని జీపీఎం అండ్ ఏఆర్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈరోజు ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పోస్టులోనే రజత్ భార్గవ పదవీ విరమణ కానున్నారు. ప్రస్తుతం పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గిరిజా శంకర్ కూడా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఎక్సైజ్, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న ముఖేశ్ కుమార్ మీనాకు పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్, అదనపు ఎన్నికల అధికారి పి.కోటేశ్వరరావు, బాపట్ల జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావులు కూడా ఈరోజు (శనివారం) పదవీ విరమణ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు