Monday, 02 December 2024 04:47:21 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Diarrhea: శ్రీ సత్యసాయి జిల్లాలో కోరలు చాస్తున్న అతిసారం.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి!

Date : 21 August 2024 03:02 PM Views : 42

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అతిసారం కోరలు చాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ముగ్గురిని పొట్ట‌నబెట్టుకుంది. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామంలో ఇలా ముగ్గురు అతిసారం కార‌ణంగా మృతిచెందారు. దీంతో స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. గత శనివారం నుంచి గ్రామంలో పలువురు విరేచనాలు, వాంతులు చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివ‌రాలు అడిగి తెలుసుకుని, చికిత్స అందించ‌డం చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక అతిసారంతో శనివారం నుంచి బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన‌ రత్నాచారి (65), పార్వతమ్మ (54)లు సోమవారం రాత్రి చ‌నిపోయారు. అలాగే శిరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంత రాయప్ప (75) అనే వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు కేవలం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే ప్రాణాలు కోల్పోవ‌డం భయందోళనలకు కార‌ణ‌మ‌వుతోంది. గత వారంలో నియోజకవర్గంలోని కొంకలు గ్రామంలో అతిసారం లక్షణాలతో మరణాలు మరవకముందే, తిరిగి రాయపురంలో అతిసారం ప్రబలడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ గ్రామంలో పర్యటించి వైద్య సిబ్బందిని అల‌ర్ట్ చేశారు. దీనిలో భాగంగా నీటి బోరు వద్ద పైప్ లైన్ లీకేజీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు