Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో కృష్ణాజిల్లా గుడివాడ చేరుకుని అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అంతకు ముందు ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో ఘన స్వాగతం పలికారు టీడీపీ నేతలు, అధికారులు. అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ప్రజలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పేదలతో కలిసి భోజనం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి భోజనం చేశారు. పేదలలో మాట్లాడి వారి కష్టాల గురించి తెలుసుకున్నారు. పేదలతో పాటు అన్న క్యాంటీన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. పేదలకు భోజనం వడ్డించారు చంద్రబాబు దంపతులు. ఏపీలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తుంది అన్న క్యాంటీన్. ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి.
Admin
Studio18 News