Studio18 News - ANDHRA PRADESH / : Deputy CM Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స్ న్ భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కల్యాణ్ యూఎస్ కాన్సుల్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని వారిని పవన్ కళ్యాణ్ కోరారు. అటవీశాఖ అధికారులకు కీలక సూచనలు.. వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో పవన్ మాట్లాడారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను వేటాడి అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకొనేటప్పుడు అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. వన్య ప్రాణులను, అటవీ సంపదకు నష్టం కలిగించినా, అక్రమ రవాణా చేసినా, ఉద్యోగులపై దాడులు చేసినా అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులకు సూచించారు.
Admin
Studio18 News