Studio18 News - ANDHRA PRADESH / : పదేళ్లపాటు తనతో సహజీవనం చేసి, మరో హీరోయిన్ మోజులో పడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఇటీవలే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా, లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని భావించి, రాజ్ తరుణ్ పై చార్జిషీట్ దాఖలు. రాజ్ తరుణ్ పై పోలీసులు చార్జిషీట్ వేయడం పట్ల లావణ్య స్పందించారు. రాజ్ తరుణ్ పై చార్జిషీట్ శుభపరిణామం అని పేర్కొన్నారు. తనకు అన్యాయం జరిగిందని, తాను న్యాయం కోసం పోరాడుతున్నానని స్పష్టం చేశారు. తనపై ఎన్నో నిందలు వేశారని, చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు. రాజ్ తరుణ్ వెళ్లిపోయాక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని లావణ్య వెల్లడించారు. రాజ్ తరుణ్, తాను పదేళ్ల పాటు సంసారం చేశామన్నది వాస్తవం అని తెలిపారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పోలీసులకు ఇచ్చానని చెప్పారు.
Admin
Studio18 News