Monday, 02 December 2024 05:25:41 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: గ్రామ సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

Date : 24 August 2024 12:02 PM Views : 65

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తోంది. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు ఈ నెల 27లోగా అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా వచ్చిన ధరఖాస్తులను కలెక్టర్ లు పరిశీలించి వాటిని ప్రాధాన్యత కేటగిరీల వారీగా విభజిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో బదిలీల కౌన్సిలింగ్ కు దరఖాస్తు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరు కావాల్సి ఉంటుంది. పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరిగా బదిలీ చేసే అధికారం కూడా కలెక్టర్ లకు ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులను బదిలీలకు అనర్హులుగా పేర్కొంది. బదిలీ అయిన ఉద్యోగులకు టీటీఏ గానీ మరే ఇతర ప్రయోజనాలు కూడా లభించవు. ఏ ఉద్యోగీ తమ స్థానిక గ్రామ, వార్డుల్లో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు. నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు మించి పని చేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు